నరేంద్ర మోదీ 70వ జన్మదినం..వెల్లువలా శుభాకాంక్షలు !

0

పవన్‌ కల్యాణ్‌తో సహా నేతలు ఏమన్నారంటే..

దిల్లీ: నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ 70వ జన్మదినం సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియచేశారు. అధ్యక్షుడు రామ్‌నాథ్‌ కోవింద్‌, హోంమంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్య్‌ణ్‌ తదితరులు వీరిలో ఉన్నారు.

రామ్‌నాథ్‌ కోవింద్‌

”ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. భారతీయ విలువలు, ప్రజాస్వామ్య విధానం పట్ల మీ విధేయత ఆదర్శప్రాయం. మీరు ఎల్లపుడూ ఆరోగ్యంగా, అనందంగా ఉండాలని.. మీ అమూల్య సేవలు దేశానికి ఎల్లపుడూ లభించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను”

అమిత్‌ షా

”దేశసేవ, పేదల సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేసిన ప్రియ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మోదీజీ రూపంలో దేశంలోని అణగారిన వర్గాలను అభివృద్ధి బాటలోకి తెచ్చి.. పటిష్ఠ భారతదేశానికి పునాది వేసిన నాయకత్వం లభించింది. ఆయన నాయకత్వంలో భరతమాతకు సేవ చేసే అవకాశం లభించటం మా అదృష్టం. మోదీజీకి సంపూర్ణ ఆయురారోగ్యాలు లభించాలని కోరుకుంటున్నాను”

రాజ్‌నాథ్‌ సింగ్‌

”ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన చురుకైన నాయకత్వం, దృఢ చిత్తం, నిర్ణయాత్మక చర్యలతో భారత్‌ అమితంగా అభివృద్ధి చెందింది. ఆయన పేదలు, అణగారిన వర్గాల వారి సాధికారత కోసం ఆయన పట్టుదలతో కృషి చేస్తున్నారు. ఆయనకు ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ప్రార్థిస్తున్నాను”

రాహుల్‌ గాంధీ

”ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీకి జన్మదిన శుభాకాంక్షలు”

అరవింద్‌ కేజ్రీవాల్‌
”మీకు అమిత సంతోషపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సార్‌. మీరు దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను”

పవన్‌ కల్యాణ్
”గౌరవనీయులైన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, మీకు మా అందరి తరపు నుంచి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!! మీ ఘనమైన, స్ఫూర్తినిచ్చే, అంకిత భావం కలిగిన నాయకత్వంలో మన భరతమాత విప్లవ ముని శ్రీ అరబిందో కలలుకన్న విధంగా తన నిజమైన కీర్తి శిఖరాలను తాకగలదని ఆశిస్తున్నాను”

Leave A Reply