రామాయణం (సరళ వ్యావహారికంలో)-134 వ భాగము

0

జటాయువు స్నేహం: శూర్పణఖ మోహం

సీతాలక్ష్మణులసహా పంచవటికి బయల్దేరాడు రాముడు. అగస్త్యుడు చెప్పిన మార్గంలోనే ప్రయాణించి, ఓ మర్రిచెట్టును సమీపించాడు. ఆ చెట్టు మీద ఓ గ్రద్దను చూశాడు.చాలా పెద్ద గ్రద్ద అది. ముసలితనంతో ముడుచుకుపోయి ఉంది. అనుమానం లేదు. రాక్షసుడే ఈ రూపంలో ఉన్నాడనుకున్నాడు రాముడు. అయినా ఆవేశపడలేదు. తన వివరాలన్నీ గ్రద్దకు తెలియజేశాడు రాముడు. తర్వాత గ్రద్ద వివరాలు చెప్పమని కోరాడు. అప్పుడు ఆ గ్రద్ద ఇలా అన్నది.‘‘రామా! నేను పక్షిరాజుని. నా పేరు జటాయువు. సూర్యరథసారథి అనూరుడు, నా తండ్రి. నాకు ఓ అన్న కూడా ఉన్నాడు. అతని పేరు సంపాతి.’’జటాయువుని రాక్షసుడని అనుమానించినందుకు బాధపడ్డాడు రాముడు. చేసిన తప్పును క్షమించమన్నట్టుగా కళ్ళు మూసుకున్నాడు ఒక్క క్షణం.‘‘రామా! మనిద్దరం సంతోషించదగ్గ విషయం ఒకటి చెప్పనా? నేనూ, నీ తండ్రీ మంచి స్నేహితులం. మీరిక్కడ నివాసం ఏర్పరచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ముసలిగ్రద్ద అయినా నా శక్తి కొలదీ నీకు సాయం చేస్తాను.’’ అన్నాడు జటాయువు.‘‘ధన్యులం’’ అన్నాడు రాముడు.‘‘రామా! ఈ దుర్గమారణ్యంలో రాక్షసులు విచ్చలవిడిగా తిరుగుతుంటారు. సీత వారి కంటపడకూడదు. పడకుండా చూసే బాధ్యత నాది. మీ సోదరులిద్దరూ వేటకి వెళ్ళే వేళ సీతాదేవి రక్షణభారం నేను వహిస్తాను.’’ అన్నాడు జటాయువు.

‘‘కృతజ్ఞులం’’ అన్నాడు రాముడు. గట్టిగా కౌగిలించుకున్నాడతన్ని.‘‘మా తండ్రికీ, నీకూ స్నేహం ఎలా ఏర్ప డింది?’’ జటాయువును ప్రశ్నించాడు లక్ష్మణుడు. ఆ వివరాలు చెప్పసాగింది జటాయువు. వాటిని వింటూ వారంతా పంచవటికి చేరుకున్నారు.పచ్చపచ్చగా ఉందంతా. పువ్వులు, తీగలు, రకరకాల పక్షులు, చిత్రవిచిత్రాలైన మృగాలు చూడముచ్చటగా ఉంది ఆ ప్రదేశం.‘‘ఇక్కడ ఎంత బాగుందో’’ మురిసిపోయింది సీత. పువ్వులు కోసుకోసాగింది. కోసుకున్న పువ్వులను కొంగులో వేసుకుంటూ, పరుగులు తీయసాగింది. ఆమెను చూసి ఆనందించాడు రాముడు. లక్ష్మణునితో చెప్పాడిలా.‘‘లక్ష్మణా! ఇక్కడే మనం పర్ణశాలను నిర్మించుకుందాం.’’‘‘ఇక్కడంటే ఎక్కడో స్పష్టంగా నువ్వూ, వదినా నిర్ణయిస్తే నేనక్కడ పర్ణశాల నిర్మిస్తాను. వదినను కనుక్కో అన్నయ్యా.’’ అన్నాడు లక్ష్మణుడు.సీతను కేకేసి నిలువమన్నాడు రాముడు. నిలిచిందామె. రాముడు సమీపించాడామెను. ఇద్దరూ కలసి, చెట్టూ పుట్టా పరిశీలిస్తూ అక్కడ ఆ ప్రాంతం అంతా తిరిగారు.‘‘ఇక్కడ ఈ ప్రదేశంలో పర్ణశాల నిర్మించుకుందాం. చాలా బాగుంది.’’ మనసుపడ్డది సీత.నిజంగానే ఆ ప్రదేశం చాలా బాగుంది. పూలగుత్తులు వేలాడుతున్న చెట్ల మధ్య మిట్ట పల్లాలు లేకుండా అక్కడి ప్రదేశం చదునుగా ఉంది. సమీపంలో సరస్సు ఉంది. అందులో ఎర్రకలువలు నిండుగా ఉన్నాయి. కొద్దిదూరంలో పావనగోదావరి ప్రవహిస్తూ ఉంది. మహాభారతం (సరళ వ్యావహారికంలో)-126 వ భాగము

ఇటు చూస్తే ఒత్తుగా లతలు పాకిన గుహలు. అటు చూస్తే మద్ది, తాడి, టేకు, తమాల, చందన, అశోక, మోదుగు, సంపెంగ, పొన్న, పారిజాతవృక్షాలు. ఎటు చూస్తే అటు నాట్యమయూరాలు. గుంపులుగా జింకలు, పక్షులు… అద్భుతం, అత్యద్భుతం అనుకున్నాడు రాముడు.‘‘లక్ష్మణా’’ కేకేసి పిలిచాడు. జటాయువుసహా లక్ష్మణుడు చేరుకున్నాడక్కడికి.‘‘ఇదిగో! ఇక్కడ ఈ ప్రదేశంలో మనం నివసిద్దాం. జటాయువు మనకి అన్ని విధాలా సహాయకుడిగా ఉంటాడు. పర్ణశాలను నువ్విక్కడే నిర్మించు.’’ చెప్పాడు రాముడు.అన్న చెప్పడం ఆలస్యం, లక్ష్మణుడు పరుగున వెళ్ళి, లావుబొంగులు, సన్న వెదుళ్ళు, జమ్మికొమ్మలు, నారలు, రెల్లు సేకరించి తీసుకుని వచ్చాడు. పునాదులు తవ్వాడు. వెదుళ్ళను స్తంభాలుగా నాటాడు. నలువైపులా గోడలు కట్టాడు. స్తంభాలపై సన్నవెదుళ్ళనీ, చెట్లకొమ్మలనీ నారలతో బిగించాడు. పైకప్పుగా రెల్లును కప్పి, పైన మళ్ళీ సన్నని వెదుళ్ళను బిగించాడు. నడుమ వేదిక, ముందు వెనుక పంచలతో విశాలంగా కుటీరాన్ని నిర్మించాడు. నేలపై నీరు జల్లాడు. దిమ్మెసతో దానిని చదును చేశాడు. గోదావరిలో స్నానం చేసి వచ్చాడు. పూలు, పండ్లు చేతిలో ఉంచుకున్నాడు. వాస్తుమంత్రాలు జపిస్తూ సీతారాములను ఆహ్వానించాడు. సీతారాములు పర్ణశాల నలువైపులా తిరిగి చూసి,

Leave A Reply