మహాభారతం (సరళ వ్యావహారికంలో)-127 వ భాగము

0

కర్ణుడు సహజ కవచకుండల మండితుడు. తేజో విరాజితుడు. మహా పురుషులు గాని వేరొకరు ఇలా ఉండేందుకు అవకాశం లేదు. అందువల్ల అంగరాజ్యానికే కాదు, సమస్త భూమండలానికే రాజుకాగల అర్హుడీతడు. ఇలాంటి వాణ్ణి పట్టుకుని నోటికి ఎంత వస్తే అంతగా మాట్లాడడం నీకే మంచిది కాదు’’ అని కర్ణుని సమీపించి-‘‘రా మిత్రమా! ఇక ఈ రంగస్థలంలో మనం ఉండాల్సిన అవసరం లేదు’’ అంటూ కర్ణుని, తమ్ములను తోడుకుని అక్కణ్ణుంచి నిష్క్రమించాడు దుర్యోధనుడు. అంతలో సూర్యుడు అస్తమించాడు. సూర్యాస్తమయంతో రంగస్థలంలో ప్రదర్శనలను నిలుపు చేశారు. ప్రేక్షకులు వెళ్ళిపోయారు. భీష్మ ద్రోణాది ప్రముఖులు కూడా వెను తిరిగారు. అంతా వెళ్ళిపోయినా వెళ్ళనిది ఒక్కరే! ఆమె కుంతి! సహజ కవచ కుండల మండితుడయిన కర్ణుడు తన కన్నబిడ్డేనన్నది గ్రహించి కుంతి రంగస్థలాన్ని వీడక దుఃఖిస్తూ కూర్చుంది.రామాయణం (సరళ వ్యావహారికంలో)-135 వ భాగము

మర్నాడు శిష్యులను సమీపించి ద్రోణాచార్యుడు గురుదక్షిణ కావాలని అడిగాడు.‘‘అభీష్టాన్ని ఆనతియ్యండి’’ అడిగారు శిష్యులు. వాళ్ళు అలా అడగడమే ఆలస్యం ద్రోణాచార్యుని కళ్ళు ఎరుపెక్కాయి. ఆగ్రహోదగ్రుడయ్యాడతను.‘‘చెప్పండి గురుదేవా? గురుదక్షిణగా మీకేం కావాలి’’ మళ్ళీ అడిగారు శిష్యులు.‘‘నాకు ద్రుపదుడు కావాలి. ఐశ్వర్య గర్వోన్మత్తుడు వాడు. కన్నుమిన్నుకానక వాడు ఒకప్పుడు నన్ను అవమానించాడు.అనేక విధాల దుర్భాషలాడి నన్ను గెంటివేశాడు. అలాంటి వాణ్ణి జయించి, బంధించి నా సన్నిధికి ఈడ్చుకుని రండి! ఇదే మీరు నాకు చెల్లించాల్సిన గురుదక్షిణ’’ అన్నాడు ద్రోణుడు.‘‘ఇదిగో ఈ క్షణమే మేము అందుకు సిద్ధం’’ అని పాండవ ధార్తరాష్ట్ర నందనులంతా శస్త్రాస్త్రాలు చేపట్టి రథాధిరూఢులై పాంచాల రాజధాని వైపు పరుగులు పెట్టారు.

Leave A Reply