మహాభారతం (సరళ వ్యావహారికంలో)-117 వ భాగము

0

‘‘సర్వసంగ పరిత్యాగివై నువ్వు అరణ్యాలను ఆశ్రయించడం శ్రేయస్కరం. తపస్సు ఆచరిస్తూ శేష జీవితాన్ని వెల్లబుచ్చడం పుణ్యప్రదం’’ అన్నాడు మళ్ళీ.‘‘ధృతరాష్ట్ర సంతతి దుర్యోధన, దుశ్శాసనులు క్రూరులు. నిష్కారణంగా శత్రుత్వాన్ని కొని తెచ్చుకుంటారు. ఫలితంగా కౌరవ కులానికి నాశనం తప్పదు. తండ్రి అయి ఉండి, పిల్లలకు బుద్ధి చెప్పడు సరికదా తాను కూడా పిల్లలతో పాటుగా దారుణ కృత్యాలకు ఒడిగడతాడు ధృతరాష్ట్రుడు. ఈ భీకర కురుకుల క్షయాన్ని నువ్వు నీ కళ్ళతో చూడలేవు. చూడకూడదు. అందుకనే చెబుతున్నాను. నువ్వు, నీ కోడళ్ళు ఇక్కణ్ణుంచి త్వరలోనే నిష్క్రమించండి! తపోవనమే మీకు క్షేమం’’ అన్న వ్యాసుని మాటలకు మరింతగా కుమిలి కుమిలి ఆఖరికి మహాముని చెప్పినట్టుగా చేసేందుకు సిద్ధమయింది సత్యవతీదేవి. అంబికను రమ్మని కబురంపింది. వచ్చిందామె. ఆమెతో వ్యాసుడు తనకి చెప్పిన వివరాలన్నీ చెప్పి-‘‘ఇక మనకు తపోవనమే తగిన స్థలం’’ అంది. అంబాలికాదేవిని కూడా రమ్మని చెప్పి ఆమెకు కూడా అన్నీ విశదం చేసింది.‘‘మరో ఆలోచన వద్దు! పదండి’’ అంది. కోడళ్ళు అత్తగారి మాటను కాదనలేదు. ‘సరే’నని ఆమెతో పాటుగా నడిచారు. గాంగేయ విదురాది ప్రముఖుల అంగీకారంతో సత్యవతిదేవి, అంబ, అంబాలికలు తపోవనాన్ని ఆశ్రయించారు. అక్కడ అపార తపస్సు ఆచరించి కొంత కాలానికి పరమ పదించారు.

పాండవులు

1. ధర్మరాజు2. భీముడు3. అర్జునుడు4. నకులుడు5. సహదేవుడు

కౌరవులు

1.దుర్యోధన2. దుశ్శాసన3. దుస్సహ4. దుశ్శల5. జలగంధ6. సామ7. సహ8. వింద9. అనువింద10. దుర్దర్శ11. సుబాహు12. దుష్ప్రదర్శన13. దుర్మర్శన14. దుర్ముఖ15. దుష్కర్ణ16. కర్ణ17. వికర్ణ18. శాల19. సత్వ20. సులోచన21. చిత్ర22. ఉపచిత్ర23. చిత్రాక్ష24. చారుచిత్ర25. శరాసన26. దుర్మద27. దుర్విగాహ28. వివిత్సు29. వికటానన30. ఊర్ణనాభ31. సునాభ32. నంద33. ఉపనంద34. చిత్రభాను35. చిత్రవర్మ36. సువర్మ37. దుర్విమోచ38. అయోబాహు39. మహాబాహు40. చిత్రాంగ41. చిత్రకుండల42. భీమవేగ43. భీమబల44. బలాకి45. బలవర్ధన46. ఉగ్రాయుధ47. సుసేన48. కుండధార49. మహోధర50. చిత్రాయుధ51. నిశాంగి52. పాశి53. బృందారక54. దృఢవర్మ55. దృఢక్షత్ర56. సోమకీర్తి57. అనుదార58. దృఢసంధ59. జరాసంధ60. సత్యసంధ61. సదాసువాక్‌62. ఉగ్రశ్రవస63. ఉగ్రసేన64. సేనాని65. దుష్పరాజయ66. అపరాజిత67. కుండశాయి68. విశాలాక్ష69. దురాధర70. దృఢహస్త71. సుహస్త72. వాతవేగ73. సువర్చస74. ఆదిత్యకేతు75. బహ్వాసి76. నాగదత్త77. అగ్రయాయి.78. కవచి79. క్రధన80. భీమవిక్రమ81. ధనుర్ధర82. వీరబాహు83. ఆలోలుప84. అభయ85. దృఢకర్మన86. దృఢరథాశ్రయ87. అనాధృష్య88. కుండభేది89. విరావి90. చిత్రకుండల91. ప్రమథ92. అప్రమథ93. దీర్ఘరోమ94. వీర్యవంత95. దీర్ఘబాహు96. సువర్మ97. కనకధ్వజ98. కుండాశి99. విరజ100. యుయుత్సు101. దుస్సల(ఏకైక సోదరి)

Leave A Reply