మహాభారతం (సరళ వ్యావహారికంలో)-100 వ భాగము

0

శంతనుడి జన్మ వృత్తాంతం

తనని సమీపించిన కర్ణునితో-‘‘నువ్వు రాధేయుడవు కాదు! సుక్షత్రియుడివి! నువ్వు కుంతి కుమారుడవు! అలాగే అర్జునుడు నర మునీంద్రుడు. శ్రీకృష్ణుడు నారాయణుడు. ఆ నర నారాయణలతో యుద్ధం నీకు అసాధ్యం. అందుకని…ఇవన్నీ చెవిన పెట్టుకుని, నీ అన్నదమ్ములు పాండవుల పక్షం చేరి అన్యోన్యతతో మసలుకో’’ అన్నాడు భీష్ముడు. ఆ మాటలకు సన్నగా నవ్వి-‘‘పితామహా! నేను కౌంతేయుడునన్న సంగతి నాకెప్పుడో తెలుసు! అయితే ఇప్పుడా విషయం అప్రస్తుతం. పైగా ఈ యుద్ధవేళ పాండవులతో నా పొందిక న్యాయం కాదు. నర నారాయణలు పాండవ పక్షంలో ఉన్న కారణంగా ఈ యుద్ధంలో పాండవులదే విజయం అన్నది కూడా నాకు తెలుసు! అయినా తప్పదు! నేను వారితో యుద్ధం చేస్తాను. పాండవులను అనరాని మాటలు అన్నాను. వారికి క్షణ క్షణం కీడు తలపెట్టాను. ఆఖరికి శత్రువునయిపోయాను. శత్రువునయిన కారణంగా వారితో యుద్ధమే నాకు సముచితంగా ఉంటుంది. దేవుడు ఎలా తలిస్తే అలా జరుగుతుంది. కాబట్టి రణకేళికి నన్ను అనుమతించండి! ఆనందిస్తాను’’ అన్నాడు కర్ణుడు. అతని విజ్ఞప్తిని ఆలకించిన శాంతనవుడు-‘‘నీ సంగ్రామ కేళికి మనసా వాచా అనుమతిస్తున్నాను’’ అన్నాడు. కర్ణుని చేయెత్తి ఆశీర్వదించాడు. భీష్ముని ఆశీస్సులందుకున్న కర్ణుడు అక్కణ్ణుంచి నిష్క్రమించాడు. సన్నగా జల్లు కురుస్తోంది. చల్లగా ఉంది వాతావరణం. కొన ఊపరితో కొట్టు మిట్టాడుతూ ఎవరో సైనికుడు బాధగా మూలుగుతున్నాడు. ఎవరో…ఎవర్నో గుర్తుపట్టడానికి ఏడుస్తూ కాగడా వెలుగుల్లో పరుగులు దీస్తున్నారు. నాలుగయిదు నక్కలు శవాన్నొకదాన్ని బరబరా ఈడ్చుకుని పోతున్నాయి.‘‘వద్దు! వినలేకపోతున్నాను! ఆపు సంజయా! ఆపు’’ అరిచాడు ధృతరాష్ట్రుడు.  రామాయణం (సరళ వ్యావహారికంలో)-107 వ భాగము

మహారాజు మాటకి తలొగ్గి రణరంగ విశేషాలు చెప్పడం ఆపివేశాడు సంజయుడు.‘‘ఈనాటికి విన్నది చాలు! ఇక విశ్రాంతి తీసుకుందాం’’ అన్నాడు ధృతరాష్ట్రుడు.‘‘చిత్తం’’ అని సెలవు తీసుకున్నాడు సంజయుడు. ఇదిలా ఉండగా-కురుక్షేత్రంలో శరశయ్య మీది భీష్ముడు-‘ఇప్పుడు ఈ చినుకులేంటి’ అనుకుని, తడిసిన ముఖాన్ని చేత్తో నిమురుకున్నాడు. ఒక్కసారిగా అతనికి తల్లి గుర్తుకు వచ్చింది. చిన్న తనంలో…విలువిద్య నే ర్చుకునే రోజుల్లో…అదే పనిగా విద్యను అభ్యసిస్తూ అలసి సొలసి స్వేదం పట్టి నిలుచుని ఉంటే తల్లి ఇలాగే తన ముఖాన్ని చేత్తో నిమిరి చల్లబరిచేది. ఆ రోజులు ఏమయిపోయాయి? తల్లీ-తండ్రి ఏమయిపోయారు? అసలు తను ఎవరు? ఎందుకిలా పుట్టాల్సి వచ్చింది? కోరుకున్నప్పుడే మృత్యువు సమీపించేటట్టు తండ్రి తనకు ఇచ్చిన వరం ఏనాటిది? ఆనాడు తను చేసిన ప్రతిజ్ఞ ఏమిటి? ఈ యుద్ధం ఎందుకు వచ్చింది? ఎవరి స్వార్థం ఈ మహా సంగ్రామానికి నాంది? విన్నవి-కన్నవి, దూరదృష్టితో తను తెలుసుకున్నవి… అన్నిటిని ఒకొక్కటిగా వరుస క్రమంలో గుర్తు చేసుకోసాగాడు భీష్ముడు. ఇక్ష్వాకువంశీయుడు మహాభిషుడు వేయి అశ్వమేధ యాగాలు, నూరు వాజపేయ యాగాలు చేసి, అమరులను ఆనందింపజేసి, స్వర్గానికి చేరుకున్నాడు. అక్కడ ఓనాడు దేవతలతోను, రాజర్షులతోను కలసి పరమేష్ఠిని సందర్శించాడు. అప్పుడక్కడికి గంగాదేవి కూడా విచ్చేసింది. అంతలో పెనుగాలి వీచింది. ఆ గాలికి గంగాదేవి పైట తొలగి, ఆమె వక్షోజాలు పూర్ణ కుంభాల్లా దర్శన మీయడంతో మహాభిషుడు తప్ప మిగిలిన వారందరూ ఆ దృశ్యాన్ని చూడకూడదన్నట్టుగా తలలొంచుకున్నారు. మహాభిషుడు మాత్రం ఆ అందాలను తనివిదీరా చూడసాగాడు. ఇదంతా ఓ కంట గమనించిన పరమేష్ఠి కోపించి, మహాభిషుని-

Leave A Reply