మహాభారతం (సరళ వ్యావహారికంలో)-95వ భాగము

0

కురు పితామహా కాచుకో’ అన్నట్టుగా చక్రాయుధాన్ని ప్రయోగించేందుకు సంసిద్ధుడయ్యాడు. కృష్ణుని ఆగ్రహానికి అల్లన నవ్వి-‘‘జనార్దనా! నీతో యుద్ధం నాకు సకల శుభాలను ప్రసాదిస్తుంది. ఆలస్యం చెయ్యకు! రా! నీతో యుద్ధం కన్నా నాకు మహాద్భాగ్యం లేదు’’ అన్నాడు భీష్ముడు. అని యుద్ధానికి సన్నద్ధమవుతుండగా…తేరుకున్న అర్జునుడు అది గమనించి కృష్ణుని వారించాడు.‘‘ఏమిటిది బావా! నీకెందుకింత కోపం’’ అనడిగాడు.‘‘ఈ తొందరపాటు నీకు న్యాయమా’’ అని ప్రశ్నించాడు.‘‘నువ్వే ఇలా అలజడి పడి యుద్ధానికి సిద్ధమయితే మా శౌర్య ధైర్యాలూ, బాహు పరాక్రమ ప్రతిష్ఠలు ఏం కావాలి’’ అని విన్నవించాడు.‘‘మాకూ మా పరాక్రమాలకు అపకీర్తిని కలిగించే నీ చేష్టలు తప్పుకాదా చెప్పు’’ అని చేతులు జోడించాడు. ప్రార్థనగా చూశాడు. ఆ చూపుకి కృష్ణుడు సంయమనాన్ని పాటించి, చల్లబడి చక్రాయుధాన్ని చూశాడు. అది అదృశ్యమయింది.‘‘నీ సహాయంతో ఈ కౌరవసేనను ఒక నిమేషకాలంలో నిర్మూలిస్తాను! రథం మీదికి రా’’ అని అర్జునుడు, కృష్ణుని సహా రథాన్ని అధిరోహించి పాంచజన్యం పూరించి పాండవ యోధులను పురిగొల్పాడు. కౌరవ భటులు కూడా భీకర నినాదాలతో పాండవుల అక్షౌహిణులతో తలపడ్డారు. కాస్సేపటికే దినకురుడు అస్తగిరి శిఖరం చేరుకోవడంతో ఆనాటి యుద్ధం ముగిసి, మరునాడు నాలుగవ రోజు యుద్ధం ప్రారంభమయింది. ఈ యుద్ధంలో శల్య కుమారుణ్ణి ధృష్టద్యుమ్నుడు కడతేర్చాడు. అలాగే నీ కుమారులు సేనాపతి, సుషేణుడు, జలసంధాదులను పధ్నాలుగు మందిని భీముడు సంహరించాడు’’ అని చెప్పి సంజయుడు ఆగాడు. తన కుమారులు పధ్నాలుగురు మరణించారని తెలిసి ధృతరాష్ట్రుడు కళ్ళు చెమర్చుకున్నాడు. అతని కన్నీటి చెమ్మను చూసే సంజయుడు చెప్పడాన్ని ఆపాడు. ఆగిపోయినసంజయుని ఉద్దేశించి-‘‘తర్వాత’’ అనడిగాడు ధృతరాష్ట్రుడు.‘‘తర్వాత అయిదవ రోజు యుద్ధం ప్రారంభమయింది. ఈ యుద్ధంలో సాత్యకి పది మంది కుమారులను భూరిశ్రవసుడు కడతేర్చాడు. ఆ సమయానికి సూర్యాస్తమయం అయింది. అది గ్రహించి, ఆనాటికి సమర విరమణ ప్రకటించాడు భీష్ముడు. దాంతో ఇరు సైన్యాలు తమతమ శిబిరాల వైపు సాగిపోయి, ఆ రాత్రి వీణా వేణు మృదంగాదులతో అలరించిన వివిధ హృద్య నృత్య సంగీతాలతోవినోదించారు.

Leave A Reply