రాగిణి,సంజ‌నాల‌కు సెక్స్ రాకెట్‌తో  కూడా సంబంధముందా?

0

డ్ర‌గ్స్ కేసులో అరెస్టై జైలు జీవితం గడుపుతున్న హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజ‌నా గ‌ల్రానీల‌కు సెక్స్ రాకెట్‌తో  కూడా సంబంధముందా? వారిద్దరి మొబైల్స్ నుంచి సీసీబీ అధికారులు ముఖ్యమైన సమాచారాన్ని సేకరించారా? అవుననే అంటున్నాయి శాండల్‌వుడ్ వర్గాలు. ఇద్దరి మొబైల్‌ఫోన్ల నుంచి సెక్స్‌ రాకెట్‌‌కు సంబంధించిన విషయాలు బయటపడినట్టు సీసీబీ వర్గాల కథనం.

వీరి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌లలో నీలి వీడియోలు, ఫోటోలు ప్ర‌త్య‌క్షమయ్యాయట. నీలి చిత్రాలకు సంబంధించిన ప్ర‌త్యేక వాట్స‌ప్ గ్రూపును వీళ్లు నిర్వ‌హిస్తున్నారని, ఇటీవ‌లె తొల‌గించార‌ని అధికారులు గుర్తించారు. ఈ గ్రూపుతో సంబంధం ఉన్న వాళ్లంద‌రికీ నోటీసులు పంపి విచార‌ణ చేపట్టాలని సీసీబీ అధికారులు భావిస్తున్నారట.

Also read: లైంగిక దాడి కేసు: అనురాగ్‌ కశ్యప్‌కు ముంబై పోలీసులు నోటీసులు

Leave A Reply