చైనా లో సోమవారం మరణాల సంఖ్య “సున్నా”

0

 ప్రపంచవ్యాప్తముగా  వైరస్ సోకిన వారి సంఖ్య : 13,47,803 

                                     కోలుకున్నవారి  సంఖ్య  :  2,77,402  

                                      మృతుల సంఖ్య   :  74,807  

ప్రపంచo మొత్తం కరోనా వైరస్‌ ఉద్ధృతిని కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటి వరకు 208 దేశాలకు పాకిన ఈ మహమ్మారి 13,47,803 మందికి సోకింది. వీరిలో 74,807 మందిని పొట్టనబెట్టుకుంది. అయితే ఐరోపా దేశాల్లో రోజువారీ మరణాల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోంది. అలాగే చైనాలో సోమవారం మరణాల సంఖ్య పూర్తిగా తగ్గిపోవడం ఆశలు రేకెత్తిస్తోంది.

కరొన వైరస్ పుట్టిన చైనాలో సోమవారం ఒక్క మరణం కూడా సంభవించలేదని అక్కడి అధికారులు వెల్లడించారు. జనవరిలో అధికారిక లెక్కలు ప్రకటించడం ప్రారంభించిన నాటి నుంచి ఒక్కరు కూడా మృతిచెందకపోవడం ఇదే తొలిసారి. అయితే విదేశాల నుంచి వస్తున్న బాధితుల సంఖ్య మాత్రం క్రమంగా పెరుగుతోంది. నిన్న మరో 38 మందిలో వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ దేశంలో బాధితుల సంఖ్య 81,740కి చేరింది. ఇక మృతుల సంఖ్య 3,331 వద్ద ఉంది.

ఇక వైరస్‌ తీవ్రత అత్యధికంగా ఉన్న అమెరికా ఇంకా సంకట పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉంది. అక్కడ మృతుల సంఖ్య ప్రస్తుతం 10,910కి చేరింది. ఇప్పటి వరకు 3,67,461 మంది వైరస్‌ బారినపడ్డట్లు గుర్తించారు. రోజురోజుకీ వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండడంతో ఆ దేశ పరిశోధన సంస్థలు టీకా, ఔషధాల పరిశోధనల్ని వేగవంతం చేశాయి. తాజాగా చేపట్టిన చర్యలతో మహమ్మారిని కట్టడి చేయగలుగుతున్నామని శ్వేతసౌధంలోని టాస్క్‌ఫోర్స్‌ తెలిపింది. గతంతో లక్ష నుంచి రెండు లక్షల వరకూ మరణించే అవకాశం ఉందని ప్రకటించిన అధికారులు దాన్ని సవరించారు. ఇప్పుడు అది లక్ష దిగువనే ఉంటుందని అంచనా వేశారు.

జపాన్‌లోనూ వైరస్‌ ఉద్ధృతి పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం సోమవారం ఆత్యయిక స్థితిని ప్రకటించింది. కరోనా వల్ల ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఒక ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఆ దేశంలో ఇప్పటి వరకూ 3,654 మంది వైరస్‌ బారినపడగా.. వీరిలో 73 మంది మరణించారు.

 

Leave A Reply