భారత్‌లో 24 గంటల్లో 79,476 పాజిటివ్ కేసులు,1069 మంది మృతి

0

భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. కాస్త తగ్గినట్టు అనిపించినా.. కేసుల్లో స్పీడ్‌ అలాగే కొనసాగుతూనే ఉంది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 79,476 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమమంలో 1,069 మంది మృతిచెందారు.. దీంతో.. కరోనా మరణాల సంఖ్య లక్ష మార్క్‌ను కూడా క్రాస్ చేసింది. తాజా కేసులతో కలుపుకుని దేశంలో నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 64,73,545కు చేరుకోగా.. ప్రస్తుతం 9,44,996 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక, ఇప్పటి వరకు కరోనాబారినపడిన 54,27,707 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,00,842కు చేరుకున్నట్టు కరోనా బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. మరోవైపు దేశవ్యాప్తంగా శుక్రవారం రోజు 11,32,675 కరోనా టెస్ట్‌లు నిర్వహించగా.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 7,78,50,403కు పెరిగినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.

Leave A Reply