భారత్ లో 24 గంటల్లో 78,524 పాజిటివ్‌ కేసులు,971 మంది మృతి

0

న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగానే పెరుగుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య 68లక్షలు మార్క్‌ను దాటింది. గడిచిన 24 గంటల్లో 78,524 కొత్త పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర కుటుంబం, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 68,35,656కు చేరింది. తాజాగా మహమ్మారి కారణంగా 971 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 9,02,425 క్రియాశీలు ఉండగా.. 58,27,705 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి కారణంగా మొత్తం 1,05,526 మంది మరణించారని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలా ఉండగా.. దేశంలో నిన్న ఒకే రోజు 11,94,321 కొవిడ్‌ శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటి వరకు 8,34,65,975 నమూనాలను పరిశీలించినట్లు వెల్లడించింది.

Leave A Reply