మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘మోసగాళ్లు’. కాజల్ అగర్వాల్ ఇందులో విష్ణు సోదరి పాత్రలో నటిస్తుంది. ప్రపంచంలో అతి పెద్దదైన ఐటీ స్కామ్‌ను బేస్ చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ప్యాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతుంది. ఈ సినిమా టీజర్‌ను స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ విడుదల చేశారు. ‘నా చిన్ననాటి స్నేహితుడు, స్కూల్‌మేట్ విష్ణు మంచుకి, ప్రియమైన కాజల్ అగర్వాల్‌కి, ఎంటైర్ యూనిట్‌కి అభినందనలు’ అంటూ బన్నీ యూనిట్‌కు విషెష్ చెప్పారు. టీజర్‌ను చూస్తుంటే సినిమా అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో సాగేలా కనిపిస్తుంది. మోసగాళ్లపై తగు చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేయడం.. విష్ణు, కాజల్ భారీ మొత్తంలో డబ్బును సంపాదించడం వంటి సన్నివేశాలను టీజర్లో చూడొచ్చు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో రుహీ సింగ్ హీరోయిన్.