- రైతులే స్వయంగా టెస్ట్ చేసుకోవచ్చు
రాయ్‌పూర్: భూసార పరీక్ష కోసం తమ పొలంలోని మట్టిని రైతులు సేకరించి అధికారులకు ఇస్తే దాన్ని వారు సంబధిత ల్యాబ్‌లో పరీక్షలు చేస్తారు. కొన్ని రోజుల తర్వాత గానీ ఫలితాలు రావు. అలాకాకుండా రైతులే సులభంగా భూసార పరీక్షలు నిర్వహించుకోగలిగేలా ఏర్పాటు ఉంటే? రైతులకు ఎంతో మేలు చేసేవిధంగా ఉండే ఓ భూసార కిట్ వచ్చేసింది. దీన్ని మన దేశ శాస్త్రవేత్తలే రూపొందించారు. పైగా సులభంగా ఎక్కడంటే అక్కడికి తరలించే వీలుగా ఉండటం ఈ కిట్ ప్రత్యేకత. దీన్ని ఛత్తీ్‌సగఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని ధర రూ.4000-4,500 మధ్య ఉంటుందని.. ఒక కిట్‌తో కనీసం 25 శాంపిళ్లను పరీక్షించవచ్చునని శాస్త్రవేత్తలు చెప్పారు.