- ప్లేస్టోర్ నుంచి తొలగింపు
- డెలిట్ చేయాల్సిందిగా వినియోగదారులకు సూచ
అక్టోబరు 5: జోకర్ మాల్వేర్ ప్రభావిత యాప్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగించాలని గూగుల్ నిర్ణయం తీసుకుంది. ఇటీవలి కాలంలో జోకర్ మాల్వేర్ దాడికి గురై అనేకమంది ఆండ్రాయిడ్ వినియోగదారులు భారీ మొత్తంలో డబ్బు పోగొట్టుకుంటుండడంతో.. గూగుల్ దిద్దుబాటు చర్య లు మొదలెట్టింది. ఇందులో భాగంగా 34 హానికరమైన యాప్‌లను గుర్తించింది. ఇవి.. స్పైవేర్, మాల్వేర్ లాంటి హానికరమైన సాఫ్ట్వేర్ వాప్తికి దోహదపడుతున్నాయని కనుగొంది. వీటిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ఆ యాప్‌ల లిస్టును విడుదల చేసి.. వినియోగదారులు వెంటనే తమ ఫోన్ల నుంచి ఈ యాప్‌లను తొలగించాలని విజ్ఞప్తి చేసింది.
పటిష్టమైన భద్రతా వ్యవస్థ కలిగిన గూగుల్‌ని కూడా బోల్తా కొట్టించేందుకు జోకర్ మాల్వేర్ ‘డ్రాపర్’ అనే ఓ సరికొత్త టెక్నిక్‌ను ఉపయోగించేది. అందువల్లనే ఈ 34 యాప్‌లు ఇంతకాలంగూగుల్ ప్లేస్టోర్‌లో ఉండగలిగాయని విశ్లేషకులు చెబుతున్నారు. హానికరమైన ఈ 34 యాప్ ల లిస్టును స్కాలర్ అనే అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ గతంలోనే విడుదల చేసింది. అప్పు డు అంతగా పట్టించుకోని గూగుల్.. ఎట్టకేలకు ఆ యాప్‌లపై చర్యలకు ఉపక్రమించింది. ఇకపై ఈ 34 యాప్‌లు ఎప్పటికీ కనిపించవని తెలిపింది.