కడుపుబ్బ నవ్వించే ఫన్నీ జోక్స్-3

0

1.‘మరీ గట్టిగా గురక పెడతారా ?’

‘డాక్టర్‌ – నేనిలా పడుకొంటానో లేదో – అలా గురక మొదలవుతుంది!’
‘మరీ గట్టిగా గురక పెడతారా ?’
‘అవును. చాలా గట్టిగా.
‘మీ గురక మూలంగా – మీ ఆవిడ ఇబ్బంది పడుతున్నారా?’
‘నాకు మేరేజి కాలేదండి’
‘అయితే సమస్యే లేదు కదా -‘
‘ఎందుకు లేదండీ? – ఇప్పటికి అయిదు ఉద్యోగాలు ఊడగొట్టుకొన్నానండి!

* * *

2.శుద్ధ వెఱ్ఱిబాగులాయన

డాక్టర్‌ ఆపరేషన్‌ థియేటర్నుంచి ఇవతలికొస్తూ
”చూడమ్మా – మీ ఆయనకి చేసిన ఆపరేషన్‌ సక్సెస్‌ అయింది! కొద్దిసేపట్లో ఆయనకి తెలివోస్తుంది” అన్నాడు.
”మీరెంత అమాయకులండి డాక్టర్‌గారూ – మా ఆయన శుద్ధ వెఱ్ఱిబాగులాయన. ఆయనకి తెలివితేటలొస్తాయంటే -నేను ఛస్తే నమ్మను.” అందా ఇల్లాలు.

* * *

3.’‘సిగరెట్లు కాల్చడం”

”సిగరెట్లు కాల్చడం వలన నష్టాలే కానీ లాభాలేమీ లేవంటారా?” చైన్‌స్మోకర్‌ సూర్యారావ్‌ డాక్టర్ని అడిగాడు.
”లేకేం. రెండు లాభాలున్నాయి!” అన్నాడు డాక్టర్‌.
”అయితే అవేమిటో చెప్పండి” ఆతృతగా అడిగాడు సూర్యారావ్‌.
”మొదటిది – మీ ఇంట్లో దొంగలు పడరు-”
”ఎందుకని?!”
”సిగరెట్లు కాల్చడం వల్ల మీరు అదే పనిగా దగ్గుతూ ఉంటారు. అందుకని దొంగలు పడరు.”
”రెండో లాభం ఏమిటో చెప్పండి.”
”మీకు ముసలితనం రాదు.”
”అదెలా??”
”ఏముంది ? మీరు ఏభైయేళ్లు దాటకుండానే చనిపోతారు కాబట్టి.”
”ఆ!!-”

Leave A Reply