భాగ్యనగరంలో మరో పరువు హత్య కేసు కలకలం..

0

హైదరాబాద్: మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య మరువక ముందే భాగ్యనగరంలో మరో పరువు హత్య కేసు కలకలం సృష్టించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ జంటపై యువతి తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. యువకుడిని కిడ్నాప్ చేయించి అతి కిరాతకంగా హత్య చేయించాడు. చందానగర్‌లో నివాసముంటున్న హేమంత్ అనే యువకుడు ఇదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ప్రేమ వివాహాన్ని ఇష్టపడని యువతి తండ్రి కిరాయి మనుషులతో యువకుడిని కిడ్నాప్ చేయించి సంగారెడ్డిలో హత్య చేయించాడు. యువ జంట చందానగర్ నుంచి వచ్చి గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో నివాసం ఉంటున్నారు. గచ్చిబౌలిలో హేమంత్ కిడ్నాప్ కేసు నమోదైంది. చందానగర్‌లో మిస్సింగ్ కేసు, సంగారెడ్డిలో హత్య కేసు నమోదు అయిన్నాయి.

కాగా.. కొండాపూర్ మండలం కిష్టాయగూడెం శివాయలోని చెట్ల పొదల్లో హేమంత్ మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లారు. హేమంత్ హత్యపై సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు.. నిన్న అర్ధరాత్రి కిష్టాయగూడెం వచ్చి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. పోలీసు వాహనాలను చూసి పెట్రోలింగ్ సిబ్బంది కూడా అక్కడికి వెళ్లింది. దీంతో హేమంత్ హత్య జరిగినట్లు సంగారెడ్డి పోలీసులు తెలుసుకున్నారు. కిష్టాయగూడెం శివారులో ఆధారాల సేకరణకు సంగారెడ్డి క్లూస్ టీమ్ వెళ్లింది. కాగా.. నిందితులు గచ్చిబౌలి పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.

Leave A Reply