బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరికి కరోనా

0

హైదరాబాద్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కరోనా బారిన పడ్డారు. ఆమె వైరస్ లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ సమయంలో ఆమె పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఈ మధ్య కాలంలో ఏపీ బీజేపీ చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో పురంధేశ్వరి చురుగ్గా పాల్గొన్నట్లు సమాచారం.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురంధేశ్వరి ఎన్నికైన తర్వాత ఆమె తన స్వగ్రామంలోనే ఉన్నారు. అయితే పార్టీ పదవి ఇచ్చిన నేపథ్యంలో ఆమెను అభినందించడానికి నాయకులు, అనేకమంది కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి పురంధేశ్వరిని కలిసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమెకు కరోనా సోకినట్లు కుటుంబసభ్యులు, పార్టీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆమె ఢిల్లీ వెళ్లి వచ్చారు. అనారోగ్యంగా ఉండడంతో ఆమె పరీక్షలు చేయించుకోగా పాజిటీవ్ వచ్చింది. దీంతో వెంటనే ఆమె హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలియవచ్చింది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

Leave A Reply