భారత్ లో కరోనా విలయ తాండవం .114 మరణాలు 4421 కేసులు

0

దిల్లీ: దేశంలో కరోనా  విజృంభణ  రోజురోజుకు పెరుగుతోంది. ఈ రోజు ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4421కి చేరింది . వీరిలో 114మంది మరణించగా 3981 మంది చికిత్స  పొందుతున్నారు . మరో 326 మంది కొవిడ్-19 నుంచి కోలుకున్నారు. ఈ సమాచారం అంతా కేంద్ర మంత్రిత్వ  శాఖ వెల్లడించింది .

గత కొన్నిరోజులుగా దేశంలో కరోనా కేసుల  సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో దేశం మొత్తం మీద  354 కొత్త  కేసులు నమోదయ్యాయి.  ఈ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటివరకు అక్కడ  45మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. మొత్తం  కేసులు  సంఖ్య 748కి చేరింది. గుజరాత్లో కొవిడ్-19 మృతుల సంఖ్య 12కు చేరింది. పాజిటివ్ కేసులు  సంఖ్య 144గా ఉంది. మధ్యప్రదేశ్లో  కరోనా  తీవ్రత మరింత పెరిగింది. మరణాల సంఖ్య 9కి  చేరగా 165పాజిటివ్ కేసులు  నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. తెలంగాణలో కొత్తగా 30 కరోనా కేసులు నిర్ధారణ కాగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 364కి చేరింది.  వీరిలో కొందరు కోలుకోగా ప్రస్తుతం 308మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ వైరస్‌ కారణంగా 11మంది చనిపోయినట్లు రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 303కి చేరింది. వీరిలోముగ్గురు మరణించారని ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా కర్నూలులో 74మందికి కరోనా సోకింది.

 

 

Leave A Reply