విలన్ కి వైఫ్ గా నటించనున్న.. అను ఇమ్మాన్యుయేల్!

0

నాగచైతన్య సరసన చేసిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రం తర్వాత టాలీవుడ్‌లో అను ఇమ్మాన్యుయేల్‌‌కి అవకాశాలే లేవు. కోలీవుడ్‌లో రెండు మూడు అవకాశాలు వచ్చినా.. అక్కడ కూడా ఆమె సేమ్ పరిస్థితులను ఎదుర్కొంటుంది. అందం ఉన్నా.. అదృష్టం అనేది లేని ఈ భామకి మళ్లీ టాలీవుడ్‌లో అవకాశం వచ్చినట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న ‘అల్లుడు అదుర్స్’ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నట్లు చిత్రయూనిట్ కూడా ధృవీకరించింది. అయితే ఈ చిత్రంలో నభా నటేష్ కూడా ఉండటంతో ఆమెది సెకండ్ హీరోయిన్ రోల్ అనుకున్నారు. కానీ తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆమెది ఈ చిత్రంలో హీరోయిన్ రోల్ కాదట. విలన్ భార్యగా అను ఈ చిత్రంలో నటిస్తుందని అంటున్నారు.

ఈ చిత్ర కథ గతంలో సంతోష్ శ్రీనివాస్ చేసిన ‘కందిరీగ’ తరహాలో ఉంటుందని, ఆ సినిమాలో సోనూసూద్‌కి హీరోయిన్ ఉన్నట్లే.. ఈ సినిమాలో కూడా విలన్‌కి భార్య ఉంటుందని, ఆ పాత్ర కోసం అను ఇమ్మాన్యుయేల్‌ని తీసుకున్నారని అంటున్నారు. మరో విశేషం ఏమిటంటో ఈ సినిమాలో కూడా విలన్ సోనూసూదే కావడం. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. అందాల అను స్థితి మరీ ఇంతగా పడిపోయిందా అనే టాక్ అప్పుడే సినీ వర్గాల్లో వినిపిస్తుండటం విడ్డూరమే మరి.

Leave A Reply